కాంగ్రెస్​ది డాగ్ విజిల్ పాలిటిక్స్ – ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్​ ఓవైసీ

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్​ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ కీలు బొమ్మ. మీకు చెప్పడానికి ఏమీ లేనప్పుడు మా బట్టల గురించి మాట్లాడటం మొదలు పెడ్తరు. దీనినే డాగ్ విజిల్ పాలిటిక్స్ అంటరు. రేవంత్ ​ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చాడు. ఆ సంస్థతో అతడికి ఇప్పటికీ కనెక్షన్ ఉంది. ఆయన్ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కంట్రోల్​ చేస్తున్నడు’ అంటూ ఓవైసీ ఫైర్ అయ్యారు.

అంతకు ముందు రేవంత్ రెడ్డి ఏమన్నారంటే..అసదుద్దీన్ ఓవైసీ తన షేర్వానీ లోపల పైజామా ఉందనుకున్నానని.. కానీ ఖాకీ నిక్కర్ ఉందని అర్థమైందంటూ రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముస్లిం హక్కుల కోసం కొట్లాడాలని అసదుద్దీన్ తండ్రి ఆయన్ని బారిష్టర్ చదివిస్తే… ముస్లింలను ఇబ్బంది పెడుతున్న బీజేపీకి మద్దతుగా ఉంటున్నారన్నారు. రాజాసింగ్‌పై మజ్లిస్ పార్టీ ఎందుకు పోటీ చేయడం లేదని రేవంత్ ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ లాంటి దొంగలను కాపాడడానికి ఓవైసీ అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలకు ఓవైసీ కౌంటర్ ఇచ్చాడు.