ఎమ్మెల్సీ లుగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ అభ్యర్థులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ క్లిన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయడంఖా మోగించారు. అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పంచుమర్తి అనురాధ టీడీపీ తరఫున విజయం సాధించారు. ఈ నలుగురు ఈరోజు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు.

శాసన మండలిలో ప్రమాణ స్వీకారం అనంతరం వేపాడ చిరంజీవి రావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, పంచుమర్తి అనురాధ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. పార్టీ అధినేత చంద్రబాబును కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నూతన ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై గట్టి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. మంచి ప్రజా ప్రతినిధులుగా పేరు తెచ్చుకోవాలని వారికి సూచించారు.