ఢిల్లీలో శాంతిభద్రతల బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే

ఢిల్లీలో పెద్ద విధ్వంసం జరిగినా ప్రధాని మోడీ ఎందుకు నోరు విప్పడం లేదు

asaduddin owaisi
asaduddin owaisi

హైదరాబాద్‌: ఢిల్లీలో శాంతిభద్రతల బాధ్యత పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదే అని ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కు వ్యతిరేకంగా ఢిల్లీలో పెద్దఎత్తున విధ్వంసం జరిగినా ప్రధాని నరేంద్రమోడీ ఎందుకు నోరు విప్పడం లేదని ఓవైసీ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని దారుస్సలాంలో ఎంఐఎం పార్టీ 62వ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ప్రసంగించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఇప్పటివరకు జరిగిన అల్లర్లలో చనిపోయిన వారంతా భారతీయులేనన్నారు. విద్వేశపూరిత ఉపన్యాసాలు చేస్తున్నానని తనపై కేసులు పెట్టినా భయపడేది లేదని అన్నారు. ఢిల్లీ అల్లర్ల బాధితులకు ఎంఐఎం ప్రజాప్రతినిధులు ఒక నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ఓవైసీ పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్‌పీఆర్‌ను అమలు చేయవద్దని ముఖ్యమంత్రి కెసిఆర్‌కు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/