నూపుర్ శర్మ వ్యాఖ్యలపై భారత్‌కు తాలిబన్‌ల ఉపన్యాసాలు
మతోన్మాదులను అనుమతించొద్దని సూచన

న్యూఢిల్లీ : మహ్మద్ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై పలు దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా తాజాగా మానవ హక్కులను కాలరాసి, రాక్షస పాలన సాగిస్తున్న తాలిబన్ సర్కారు (ఆఫ్ఘానిస్థాన్) సైతం ఈ విషయంలో భారత్ కు పాఠాలు చెప్పే ప్రయత్నం చేయడమే విడ్డూరంగా ఉంది. ‘‘పవిత్ర ఇస్లామ్ ను అవమానించడం, ముస్లింల మనోభావాలను రెచ్చగొట్టే దిశగా మతోన్మాదులు వ్యాఖ్యానించకుండా భారత్ సర్కారు చర్యలు తీసుకోవాలి’’ అని తాలిబన్ అధికార ప్రతినిధి జబీదుల్లా ముజాహిద్ డిమాండ్ చేశారు. ప్రవక్తపై వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇప్పటి వరకు 14 దేశాలు బీజేపీ నేతల వ్యాఖ్యలను ఖండించాయి.
అయితే, అవి వ్యక్తులు చేసిన వ్యాఖ్యలు అని, వారిపై సంబంధిత పార్టీ చర్యలు కూడా తీసుకున్నట్టు భారత సర్కారు స్పష్టం చేసింది. వ్యక్తుల అభిప్రాయాలను భారత ప్రభుత్వానికి ఆపాదించొద్దని, అన్ని మతాలను సమానంగా గౌరవించడమే తమ విధానమని స్పష్టం చేయడం గమనార్హం.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/