ఏపీలో రేపటి నుంచి కొనసాగనున్న ఉద్యోగుల బదిలీలు
గైడ్ లైన్స్ జారీ చేసిన ప్రభుత్వం

అమరావతి : ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. బుధవారం (జూన్ 8) నుంచి ఈ నెల 17 వరకు ఉద్యోగుల బదిలీలు జరగనున్నాయి. ఈ మేరకు మంగళవారం ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన గైడ్ లైన్స్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం రేపటి నుంచి మొదలయ్యే బదిలీలు ఈ నెల 17న ముగియనున్నాయి.
ఉద్యోగుల సాధారణ బదిలీలకు సంబంధిన ఫైల్‌పై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారమే సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఈ నెల 17లోగా ఉద్యోగుల బదిలీలు పూర్తి అయ్యేలా చూడాలంటూ జగన్ సూచించారు. బదిలీల్లో ఎలాంటి వివాదాలు రాకుండా చూడాలని కూడా జగన్ అధికారులకు సూచించారు. జగన్ సూచనలకు అనుగుణంగానే తాజాగా మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/