పవన్ మూవీ లో అర్జున్ దాస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG లో కోలీవుడ్ స్టార్ అర్జున్ దాస్ నటిస్తున్నాడు. ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలో కనిపించిన అర్జున్..ఇటీవల ‘బుట్టబొమ్మ’ అనే స్ట్రయిట్ తెలుగు మూవీ చేశాడు. తాజాగా క్రేజీ ప్రాజెక్టు ‘OG’లో జాయిన్ అవుతున్నాడు. ఈ విషయాన్నీ ఆయనే తన సోషల్ మీడియా పేజీ లో తెలిపారు.

“తాజాగా నేను హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాను. ‘OG’ సెట్స్ లో మూవీ టీమ్ తో మీట్ అయ్యాను. పవన్ కల్యాణ్ గారితో మీటింగ్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా మంది నన్ను ‘OG’లో ఉన్నారా? అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను అధికారికంగా చెప్తున్నాను. అవును. నేను ‘OG’లో ఉన్నాను. ఈ సినిమాలో అవకాశం కల్పించిన సుజీత్ గారికి, దానయ్య గారికి, పవన్ కల్యాణ్ గారికి ధన్యవాదాలు!” అని అర్జున్ దాస్ వెల్లడించారు.

పవన్ హీరోగా ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఓజీ – ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. శ్రీమతి పార్వతి చిత్ర సమర్పకురాలు. ‘ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం’ తర్వాత దానయ్య నిర్మిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.