మరో 35 కంటైన్‌మెంట్‌ జోన్ల ఎత్తివేత!

లాక్‌డౌన్‌ నింధనలు తప్పక పాటించాల్సిందే.

containment zone
containment zone

హైదరాబాద్‌: తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టింది. గత కోద్ది రోజులుగా కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదు అవుతుండడమే ఇందుకు నిదర్శనం. దీంతో అధికారులు కేసులు నమోదు కాని ప్రాంతాలలో కంటైన్‌ మెంట్‌ జోన్లను ఎత్తి వేస్తున్నారు. గత పద్నాలుగు రోజులుగా కేసులు నమోదు కాని మరో 35 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధిలోనుంచి ఎత్తివేశారు. ఇందులో సగం పాతబస్తీ పరిధిలో ఉండడం గమనార్హం. కంటైన్‌మెంట్‌ జోన్‌ పరిధి ఎత్తివేసినప్పటికి లాక్‌డౌన్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/