సోపియాన్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
కశ్మీరీ పండిట్ హత్యకేసులో ఒకరు, నేపాలీ హత్య కేసులో మరొకరి ప్రమేయం

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్ షోపియాన్ జిల్లాలోని ముంజ్ మార్గ్ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల్లో ఒకడిని షోపియాన్‌కు చెందిన లతీఫ్ లోనెగా గుర్తించగా, మరొకడిని అనంతనాగ్‌కు చెందిన ఉమర్ నజీర్‌గా గుర్తించారు. కశ్మీరీ పండిట్ పురానా కృష్ణ భట్ హత్య కేసులో లతీఫ్ ప్రమేయం ఉండగా, నేపాల్‌కు చెందిన తిల్ బహదూర్ థాపా హత్య కేసులో ఉమర్ నజీర్ నిందితుడు.
నిందితుల నుంచి ఏకే 47 తుపాకి, రెండు పిస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. పోలీసులు, భద్రతా దళాలు ఉమ్మడిగా గాలిస్తుండగా తారసపడిన ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి.