అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపూర్ వాసుల మృతి

ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ చిన్నాన్న కుటుంబం మృతి

Road Accident
Road accident

హైదరాబాద్‌ః అమెరికాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో అమ‌లాపురం ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్య‌క్తులు మృతి చెందారు. ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వార‌ని అమెరికా పోలీసులు తేల్చారు. టెక్సాస్ హైవేలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఈ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముమ్మడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ బంధువులు కూడా ఉన్నారు.

వారిని సతీశ్ చిన్నాన్న నాగేశ్వరరావు, ఆయన భార్య సీతామహాలక్ష్మి, కుమార్తె నవీన గంగ, మనవడు, మనవరాలు ఉన్నారు. నాగేశ్వరరావు అల్లుడు లోకేశ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద వార్త తెలియడంతో అమలాపురంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల బంధువులకు సమాచారం అందించినట్లు తెలిపారు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.