కరోనా కిట్ల కొనుగోలు అవినీతిని నిరూపించాలి

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

buggana rajendra prasad
buggana rajendranath

అమరావతి; గతంలో ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణ కరోనా టెస్టింగ్ కిట్ల కొనుగోలులో భారీ అవినీతి జరిగిందని ఆరోపించించారు. ఈ ఆరోపణలలపై ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డాడు. తాను డైరెక్టర్ గా ఉన్న కంపెనీ ద్వారా ఏపీ ప్రభుత్వం కరోనా కిట్లను కొనుగోలు చేసిందంటూ చేసిన ఆరోపణలపై ఆగ్రహం వ్యక్తం చేసారు. రేపు ఉదయం 9 గంటల వరకు తన కంపెనీ ద్వారా కరోనా కిట్లు కొనుగులు చేసినట్లు నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. ఒకవేళ నిరూపించక పొతే కన్నా తన పదవికి రాజీనామా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. రాష్ట్రములో కరోనా రాజకీయాలు నడుస్తున్నాయని, కరోనా కిట్ల కొనుగోలులో తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని బుగ్గన అన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి ; https://www.vaartha.com/news/sports/