దేశంలో ఆరోగ్య బీమాలో ఏపి నంబర్‌ వన్‌

గ్రామాల్లో 76.1 శాతం మందికి బీమా అందుతుంది..విజయసాయి రెడ్డి

vijaya sai reddy
vijaya sai reddy

అమరావతి: ఆరోగ్య బీమాను ప్రజలందరికీ దగ్గర చేయడంలో ఏపి ప్రభుత్వం ముందు నిలిచిందని వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. ఆరోగ్య బీమా అమలు విషయంలో ఏపి తొలి స్థానంలో ఉందని అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, ‘దేశంలోనే అరోగ్య బీమా పొందుతున్నవారిలో ఏపి నంబర్ 1. ప్రభుత్వ బీమా పొందుతున్నవారు దేశ సగటు గ్రామాల్లో 12.9, పట్టణాల్లో 8.9 శాతం. ఏపిలో గ్రామాల్లో 76.1%, పట్టణాల్లో 55.9%. ఈ ఘనత ఆ మహానేత వైఎస్ఆర్ మరియు వైఎస్ జగన్ గారిదే’ అని వ్యాఖ్యానించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/