అక్షిత్‌-శశికుమార్‌ ‘సీతాయణం’

సెకండ్‌ సింగిల్‌ విడుదల

Akshit-Sasikumar 'Sitayanam'
Akshit-Sasikumar ‘Sitayanam’

అక్షిత్‌ శశికుమార్‌ ‘సీతాయణం సెకండ్‌ సింగిల్‌ను బుధవారం ‘నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న విడుదల చేశారు. మనసు పలికే అంటూ సాగే ఈ పాటను చంద్రబోస్‌ రాయగా శ్వేతా మోహన్‌ ఆలపించారు.

తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో కలర్‌ క్లౌడ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రోహన్‌ భరద్వాజ్‌ సమర్పణలో లలిత రాజ్యలక్ష్మి నిర్మించిన చిత్రం ‘సీతాయణం..

కన్నడ హీరో శశికుమార్‌ తనయుడు అక్షిత్‌ శశికుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌, అంథమ్‌ ఇటీవల ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి.

ఈసందర్భంగా రష్మిక మాట్లాడారు..మెలొడీ ప్రధానమైన ఈ గీతం మూడు భాషల ప్రేక్షకులను విశేషంగా ఆకర్షిస్తోందన్నారు. ఖచ్చితంగా ట్రెండింగ్‌ అవుతుందన్నారు.

ఈచిత్రం మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.

కార్యక్రమంలో హీరో అక్షిత్‌ శశికుమార్‌, దర్శక నిర్మాతలు ప్రభాకర్‌ ఆరిపాక, లలిత రాజ్యలక్ష్మి మాట్లాడారు.

అతిత్వరలో ట్రైలర్‌ను విడుదల చేస్తామని, ఈచిత్రాన్ని త్వరలో 3 భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తామని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/