కెటిఆర్‌కు రాహుల్‌ సిప్లిగంజ్‌ విజ్ఞప్తి

పబ్‌లో దాడి ..తనకు న్యాయం చేయాలంటూ కెటిఆర్‌ ను కోరిన రాహుల్

ktr-rahul-sipligunj
ktr-rahul-sipligunj

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌-3 విజేత, ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌పై ఓ పబ్‌లో దాడి జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రాహుల్‌ తన మీద దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా తెలంగాణ మంత్రి కెటిఆర్‌కు విజ్ఞప్తి చేశాడు. తనను పబ్ లో దారుణంగా కొడుతున్న దృశ్యాలతో ఓ వీడియోను రాహుల్ ట్వీట్ చేశాడు. ఖికేటీఆర్ సర్, దీనిపై సరైన చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు ఇందులో జోక్యం చేసుకోవాలి. నా వైపు నుంచి ఎలాంటి తప్పు ఉందని తేలినా కఠిన చర్యలకైనా సిద్ధమే. కానీ ఇక్కడ నేనో, ఓ సామాన్యుడో ఎలాంటి తప్పు చేయకుండా ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు చిక్కుకోవాలి?’​ అంటూ ఎంతో ఆవేదనతో ట్వీట్ చేశాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/