వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలి

ముఖ్యమంత్రి జగన్‌ అమలు చేసిన పథకాలు ప్రజలకు వివరించాలి

anantha venkatarami reddy
anantha venkatarami reddy

అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ప్రభజనం సృష్టించాలని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి అమలు చేసిన పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. 9 నెలల పాలనతో నవరత్నాల అమలు ఎలా ఉందో ప్రచారంలో పేర్కొనాలని సూచించారు. చంద్రబాబు కుట్రలను రాజకీయంగా ధీటుగా ఎదుర్కొవాలని సూచించారు. అత్యధిక స్థానాల్లో వైఎస్‌ఆర్‌సిపి గెలిచి, టిడిపి, జనసేనకు బుద్ది చెప్పాలన్నారు. ఇక ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్‌ మాట్లాడుతూ..ముఖ్యమంత్రి జగన్‌ పరిపాలన అద్భుతంగా ఉందని, ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకేళ్లాలన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/