ఈరోజు 25 మంది ఏపీ మంత్రుల రాజీనామా..

ఈరోజు ఏపీ మంత్రులకు చివరి రోజు. ఈరోజు సాయంత్రం మూడు గంటలకు ఏపీ కాబినెట్ సమావేశం జరగనుంది. ఈ నెల 11 కొత్త కాబినెట్ ఏర్పటు జరగనున్న నేపథ్యంలో ఈరోజు సమావేశంలో ప్రస్తుతం ఉన్న మంత్రులు రాజీనామా చేయబోతున్నారు. మంత్రి మండలిలోని.. మొత్తం 25 మంది మంత్రుల నుంచి ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి.. రాజీనామాలు తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది.

రాజీనామా చేసే 25 మంది స్థానంలో పూర్తిగా కొత్త వారినే తీసుకుంటారా? లేదంటే, పాతవారిలోనూ కొందరికి మంత్రి పదవులు మార్చి ఇచ్చే అవకాశం ఉందా? అన్న విషయం తెలియరాలేదు. అయితే, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, గుమ్మనూరు జయరాం, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజులలో ముగ్గురు, లేదంటే నలుగురిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఎవరెవరు రాజీనామా చేస్తారో సాయంత్రం తెలుస్తుంది.