స్వర్ణ ప్యాలెస్ ప్రమాద బాధితులకు 50 లక్షలు

ఇటీవల విజయవాడ స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం

Ministers Distribution Compensation 50 lakhs Cheques to Swarna palace fire accident Victims Family

విజయవాడ: స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు యాభై లక్షల రూపాయలు చొప్పున చెక్కులు అందచేశారు. మంత్రులు ఆళ్ల నాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు, సామినేని ఉదయభాను, కలెక్టర్ ఇంతియాజ్ ల సమక్షంలో బాధితులకు ఆర్ధిక సహాయం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ, కుటుంబ పెద్దలు చనిపోవడంతో ఆదరణ లేకుండా పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు సిఎం జగన్ మానవత్వంతో రూ.50 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటించారని, ఆయన ఇచ్చిన హామీ మేరకు ఇవాళ మృతుల కుటుంబాలకు పరిహారం అందించామని వెల్లడించారు. విజయవాడకు చెందిన ఆరుగురికి, మచిలీపట్నంకు చెందిన ముగ్గురికి చెక్ లు ఇచ్చామని, భర్తను కోల్పోయిన కందుకూరుకు చెందిన యువతి గర్భవతి అయినందున ఆమె ఇంటికి వెళ్లి చెక్ అందిస్తామని మంత్రి వివరించారు.


కాగా విజయవాడ నగరంలో ఇటీవల స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో పది మంది వరకు మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మృతుల కుటుంబాలకు ఏపి మంత్రులు రూ.50 లక్షల చొప్పున చెక్కులను పరిహారంగా అందించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/