నేడు ఏపి మంత్రివర్గ సమావేశం

అమరావతి: ఏపి సిఎం జగన్ అధ్యక్షతన ఈరోజు ఉదయం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగనుంది. ఉగాది ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చ, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైనా చర్చ జరగనుంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లపై కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా ఆర్డినెన్స్ జారీ చేసే అంశంపై చర్చించే అవకాశం ఉంది. జాతీయ పౌర పట్టిక(ఎన్పీఆర్) 2010 విధి విధానాల ప్రకారం కేబినెట్లో తీర్మానం చేసే అవకాశం ఉంది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/