ఆందోళన విరమించేది లేదు…

పోలీసులతో అమరావతి మహిళల వాగ్వాదం
77వ రోజుకు చేరిన ‘రాజధాని’ ఆందోళన

amaravati ladies dharna
మందడం గ్రామంలో మహిళా రైతుల ధర్నాలో వక్తలు

తుళ్ళూరు : ఏపి రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 77వ రోజు కొనసాగుతున్నాయి. మందడం,వెలగపూడి, రాయపూడి,తుళ్ళూరు తదితర గ్రామాల్లో రైతులు ,మహిళలు వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తంచేస్తున్నారు.

రైతులు దీక్షలకు వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన మహిళలు సంఘీభావం ప్రకటిస్తున్నారు.మందడం రైతులు ధర్నాకు కృష్ణాజిల్లా కొండపల్లి,ప్రసాదంపాడు మహిళలు మద్దతు తెలిపారు.రైతులతోపాటు దీక్షాశిభింరలో కూర్చుని ఆందోళనల్లో పాల్గొన్నారు.రాష్ట్ర రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి సచివాలయానికి వెళ్ళడంతో మందడంలో భారీగా పోలీసులు మోహరించారు .గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద మెట్లు పట్టుకొని పహారా కాశారు.మందడం దీక్షా శిబిరంపై ఆంక్షలు విధించారు.కొత్తగా ఏర్పాటుచేసిన శిబిరంలో రైతులు ఆందోళన చేసేందుకు అనుమతివ్వలేదు.

ఈ క్రమంలో పోలీసులు,మహిళలకు మద్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకొంది.ప్రైవేటు స్థలంలో ఆందోళన చేస్తుంటే పోలీసుల అభ్యంతర మేంటని మహిళలు నిలదీశారు.ఎవరెంత రెచ్చగొడుతున్నా గత 76రోజులుగా శాంతియుతంగానే ఆందోళనలు కొనసాగిస్తున్నామని తెలిపారు.పాలకులు మాగోడు వినాలనే ఇన్ని రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్నామని,.అలాంటిది పాలకులకు కనబడకూడదని ఆంక్షలు విధించడం సరికాదని రైతుల ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

తమ హక్కుల కోసమే ఈ పోరాటమని..ఎట్టి పరిస్థితుల్లోను దీక్షా శిబిరాన్ని ఖాళీ చేసేది లేదనివారు తేల్చి చెప్పారు.అదేవిధంగా అమరాతిని రాజధానిగా కొనసాగించే వరకు తమ పోరాటం ఆగదని రైతులు స్పష్టం చేశారు.యధావిధిగా రాజధాని రైతులు పోరాటం జరుగుతుందని జేఏసి నాయకులు వెల్లడించారు.

తుళ్ళూరు పెదపరిమి,మందడం,వెలగపూడి,రాయపూడి గ్రామాల్లో రోడ్డుపైనే వంటావార్పు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.పాలక ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుందని రైతులు గోడు వినిపించుకోకుండా తమ ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి రైతులకు న్యాయం జరిగే విధంగా మూడు రాజధానుల ప్రకటన విరిమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/