మంత్రి దాడిశెట్టి రాజా తల్లి కన్నుమూత

గుండెపోటుతో ఆమె మరణించినట్టు సమాచారం

ap-minister-dadisetti-raja-mother-passed-away

అమరావతిః ఏపీ మంత్రి దాడిశెట్టి రాజా నివాసంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి సత్యనారాయణమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో ఆమె మృతి చెందినట్టు తెలుస్తోంది. ఆమె వయసు 66 ఏళ్లు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1975 జులై 19న సత్యనారాయణమ్మ, శంకర్ రావు దంపతులకు తుని మండలం ఎస్. అన్నవరంలో దాడిశెట్టి రాజా జన్మించారు. బీఏ వరకు చదువుకున్న ఆయన ఆ తర్వాత రాజకీయాల వైపు మళ్లారు. తల్లి మృతి నేపథ్యంలో దాడిశెట్టి రాజాకు పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఆమె అంత్యక్రియలు ఈ సాయంత్రం జరిగే అవకాశం ఉంది.