తెలంగాణలో ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు!

Applications for new ration cards in Telangana from 28th of this month!

హైదరాబాద్ః తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు అయిన కాంగ్రెస్ కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు ముహూర్తం ఖరారు చేసింది. అర్హుల ఎంపిక క్షేత్రస్థాయిలోనే జరిగేలా కార్యచరణ సిద్ధం చేస్తున్నారు. అర్హులైన వారికి కార్డులు అందించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమిస్తున్నారు. దీంతో ఈనెల 28వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల జారీకి దరఖాస్తుల స్వీకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ సేవ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హుల ఎంపిక క్షేత్రస్థాయిలోనే జరగనుంది. అవసరమైన పత్రాలను ఆన్లైన్ లో దరఖాస్తు సమయంలోనే సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను గ్రామం మరియు బస్తీ సభల ద్వారా అధికారులు ఎంపిక చేస్తారు.