రావత్ దంపతుల అంతిమయాత్ర ప్రారంభం

న్యూఢిల్లీ : రావత్ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢిల్లీ కామ్రాజ్ మార్గ్ లోని రావత్ నివాసం నుంచి వారి భౌతికకాయాలనుంచిన వాహనం ఢిల్లీ కంటోన్మెంట్‌లోని బ్రార్ స్క్వేర్‌లోని శ్మశానవాటికకు బయలుదేరింది. అయితే అంత్య‌క్రియ‌ల‌ను పూర్తిగా సైనిక లాంఛ‌నాల‌తో నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో త్రివిధ ద‌ళాలు 17 సార్లు గ‌న్ సెల్యూట్ చేయ‌నున్నాయి. ఇంకా సుమారు 800 మంది త్రివిధ‌ద‌ళాల‌కు చెందిన సిబ్బంది ద‌హ‌న సంస్కారాల్లో పాల్గొనున్నారు. భారీ జ‌న స‌మూహం మ‌ధ్య రావ‌త్ దంప‌తుల అంతిమ‌యాత్ర సాగుతోంది. ఆర్మీ చీఫ్ ఎంఎన్ న‌ర‌వాణే, ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ మార్ష‌ల్ వీఆర్ చౌద‌రీ, నేవీ చీఫ్ అడ్మిర‌ల్ ఆర్ హ‌రికుమార్‌లు ఇవాళ రావ‌త్ పార్దీవ‌దేహానికి నివాళి అర్పించారు. శ్రీలంక‌, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ల‌కు చెందిన సైనిక క‌మాండ‌ర్లు రావ‌త్ అంత్య‌క్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/