ఎస్వీబీసి చైర్మన్‌గా యాంకర్‌ స్వప్న?

Anchor Swapna
Anchor Swapna

తిరుపతి: శ్రీవెంకటేశ్వర భక్తి ఛానెల్‌ చైర్మన్‌గా పృథ్వీ రాజీనామా అనంతరం తదుపరి చైర్మన్‌ ఎవరన్నదీ సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం. అయితే ఈ పదవి ప్రముఖ జర్నలిస్టు స్వప్న పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆమె ఎస్వీబీసి డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. కాగా తాజాగా ఎస్వీబీసిలో చోటు చేసుకున్న సంఘటనల కారణంగా ఆ సంస్థ చైర్మన్‌ పృథ్వీ రాజీనామా చేశారు. అయితే ఆయన టిటిడి డైరెక్టర్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఆదేశానుసారం రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న స్వప్న, చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలుగు న్యూస్‌ ఛానెల్స్‌లో అంచెలంచెలుగా ఎదిగిన స్వప్న ప్రస్తుతం ఓ ఛానెల్‌ లో యాంకర్‌గా పని చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/