ప్రజావాక్కు

Voice of the people
Voice of the people

సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి:- బుగ్గన మధుసూదన రెడ్డి, బేతంచెర్ల, కర్నూలుజిల్లా

ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఖచ్చితంగా జర్నలిస్టుల సంక్షే మంపట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే జర్నలిస్టులు ఎల్లవేళలా ప్రజలకు ఏ సమ స్య వచ్చినా స్పందిస్తూ వారికి తలలో నాలుకలాగ ఉండటమే కాక అధికారంలో ఉన్న ప్రభుత్వాలు చేస్తున్న అభివృద్ధిని ఎప్ప టికప్పుడు ప్రజలకు తెలియచేస్తూ పరోక్షంగా ప్రభుత్వాలకు, ప్రజలకు మార్గదర్శకం వహిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచే జర్నలిస్టు సోదరుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి శీతకన్ను తగదు. వీలైనంత వరకు వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వ భుజస్కందా లపై ఎంతైనా ఉంది. ముఖ్యంగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జర్న లిస్టు కుటుంబాలు తీవ్రఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతు న్నాయి అనే మాట అక్షర సత్యం.

ఎన్నికలు సాఫీగా జరిగేనా?: -యర్రమోతుధర్మరాజు, ధవళేశ్వరం

లోక్‌సభ, శాసనసభ అన్ని ఎన్నికలు ఒకేసారి జరగాలని కేంద్ర ప్రభుత్వం జెమిలి కి సిద్ధపడుతుండగా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు పలు దఫాలుగా జరిపించడం ఆలోచించేది గా ఉంది. ప్రభుత్వానికి ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇస్తారని భయాందోళనలో ఒకేసారి జరిపించలేకపోతుందని వివిధ వర్గా ల మేధావ్ఞలు భావిస్తున్నారు.అమరావతితోపాటు ఇతర నగర, పురపాలక సంస్థలు ఎంపిటిసి, జెడ్పిటిసిలకు కూడా పూర్తి స్థాయిలోఎన్నికలు జరిపించలేకపోతున్నారో అర్థంకాక ఉన్నది. దానికితోడు అధికార పార్టీ కార్యవర్గం తమ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఓటమి చెందితే భవిష్యత్తులో మంత్రివర్గం నుండి ఉద్వాసన పలకడం, రాబోయే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వకపోవ డం వంటి హెచ్చరికలు జారీ చేయడం మానసిక భయాం దోళనతో జగన్‌ ఉన్నట్లు అర్థం అవ్ఞతోంది.

మార్పు అనివార్యం:-మిస్సుల గాయత్రీదేవిశివరామకృష్ణ, అత్తాపూరు

అవినీతి, లంచగొండితనం పెచ్చుమీరిన సమాజంలో మార్పు అనివార్యం.ఈ అవినీతిజాడ్యం ఏఒక్కశాఖకో చెందినదని చెప్ప గలమా?అన్ని ప్రభుత్వశాఖలు ఒకదానితో ఒకటిపోటీ పడుతు న్నాయి.ప్రతి చిన్నదానికి ఏవేవో సాకులు చూపి అలక్ష్యం చేస్తు ఆలస్యం చేసి లంచాలు తీసుకోవడం ప్రభుత్వ ఉద్యో గులకు అలవాటుగా మారిందని ప్రజల్లో ఒక అభిప్రాయం. మాటలకే పరిమితమైన మన నైతిక విలువలపై పోరాడేది ఎప్పుడు?

న్యాయవిచారణ ప్రక్రియ వేగవంతం కావాలి:-గరిమెళ్ల రామకృష్ణ, ఏలూరు, ప.గోజిల్లా

తాజాగా యస్‌బ్యాంకు ఉదంతం మన చట్టాల్లోని డొల్లతనాన్ని మరోసారి బయటపెట్టింది. అసలు ఈ దేశంలో ఆర్థిక నేరగాళ్ల ను శిక్షించడానికి మన చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయి. ఆర్థిక నేరాలపై సంవత్సరాల తరబడి విచారణలు కొనసాగ టం,ఆపై ఆయానేరాల్లో ముద్దాయిలుగా ఉన్నవారే చట్టసభల లోకి దర్జాగావచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడటం ప్రత్య క్షంగా చూస్తున్నాం.అవకతవకలుబయటపడానికే సంవత్సరాలు పడుతుంటే ఇక అభియోగాల నమోదు, నేర విచారణ, నేర గాళ్లు విదేశాలకు పారిపోవడం,కేసులను వీలైనంత వరకు విచా రణ ముందుకు సాగకుండా ఖరీదైనవకీళ్లను నియమించి, చట్టా ల్లోనిలొసుగులను పూర్తిగాసద్వినియోగం చేసుకొంటున్నారు.

చెత్తకుప్పల్లో బట్వాడాకాని ఉత్తరాలు:-ఇమ్మడి నాగేశ్‌, సంస్థాన్‌ నారాయణపూర్‌, యాదాద్రిజిల్లా

గత ఆరు నెలల కాలంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌, దాని శివారులో రెండుసార్లు తపాలా ఉత్తరాలు బట్వాడా కాకుండానే పట్టుబడ్డాయి.ఒకసారికాల్చివేతకు గురికాగా మరొకసారి పారబో తకు గురయ్యాయి. ముఖ్యమైన కవర్లు, ఓటరు ఐడి కార్డులు, ఆధార్‌ కార్డులు వీటిలో బయటపడడం శోచనీయం. ఏ డివి జన్‌లోనైనా పోస్టుమెన్‌ల సంఖ్య తక్కువగా ఉంటే తగు సంఖ్య లో జనాభాకు తగ్గట్టు నియమించుకోవాలి. కానీ సదరు ఉద్యో గులు ఇంత దిగజారుడు పనికి పూనుకోవడం ఆశాఖకు ప్రజానీ కానికి తీవ్ర ద్రోహం చేసినట్లవ్ఞతుంది. అందులో ఒక పేదవాడి వయోపరిమితికి దగ్గర ఉన్నవారి ఉద్యోగ నియామక పత్రమో లేదా ఇంటర్వ్యూ కాల్‌లెటరో ఉంటే ఆ నష్టాన్ని సదరు ఉద్యోగులు లేదా సదరు శాఖ పూడ్చగలదా?కావ్ఞన ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూడాలి.

ఉద్యోగులను విస్మరించిన బడ్జెట్‌:-సామంతుల సదానందం, పరకాల, వరంగల్‌

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులను పట్టించుకోకపోవడం పట్ల పలువ్ఞరు ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ప్రసంగంలో ఉద్యోగుల పిఆర్సీ ప్రస్తావన లేకపోవడం అందుకు నిధులు కేటాయించలేకపోవడం పట్ల తీవ్ర నిరాశ వ్యక్తపరుస్తున్నారు. లక్షా ఎనభైరెండువేల నూట తొంభై నాలుగు కోట్ల బడ్జెట్‌లో విద్యారంగానికి కేవలం 12వేల కోట్లు కేటాయించడం పట్ల విద్యాభిమానులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల వయోపరిమితి పెంపు, పిఆర్సీకి నిధు లు కేటాయించకపోవడం ప్రభుత్వానికి ఉద్యోగుల పట్ల ఉన్న వివక్ష అర్థమవ్ఞతున్నది.