రమేశ్‌కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి..హైకోర్టు

నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ కొట్టివేత

rameshkumar-ap high court

అమరావతి: ఏపిలో ఎన్నికల కమిషనర్‌ తొలగింపు వ్యవహారంపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రమేశ్‌ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తిరిగి నిమమించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాక ఏపి ప్రభుత్వం జారీ చేసిన జోవోలన్నీ హైకోర్టు రద్దు చేసింది. ఈ విషయంపై కొన్ని రోజులుగా విచారణ జరిపిన హైకోర్టు.. ఎస్‌ఈసీ విషయంలో నిబంధనలు మారుస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ కొట్టివేస్తున్నట్లు ఈ రోజు ప్రకటించింది. కాగా ఆర్డినెన్స్‌ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనను తొలగించే అధికారం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, గవర్నర్ తెచ్చిన ఆర్డినెన్స్‌ ఇప్పుడు పనిచేయదని హైకోర్టు స్పష్టం చేసింది. వెంటనే నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను విధుల్లోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఈ క్షణం నుంచి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా కొనసాగుతారని తెలిపారు. ఎన్నికల కమిషనర్‌గా కనగరాజు కొనసాగడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఆర్డినెన్స్‌ రద్దు కావడంతో నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ ఎస్‌ఈసీగా ఉన్నట్టేనని వివరించారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/