మళ్లీ పదవిలోకి వచ్చాను..నిమ్మగడ్డ రమేశ్

స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం

AP Election Commissioner Ramesh Kumar
AP Election Commissioner Ramesh Kumar

అమరావతి: ఏపి రాష్ట్ర ఎన్నికల కమిసన్‌ మార్పు విషయంపై హైకోర్టు తీర్పు వెల్లడించిన అనంతరం నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ..హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం తాను మళ్లీ పదవిలోకి వచ్చానని తెలిపారు. తాను ఇకపై కూడా గతంలో మాదిరిగాననే నిష్పక్షపాతంగా పనిచేస్తానని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణ స్వీకారం చేసిన వారంతా ఆ వ్యవస్థలకు కట్టుబడి వ్యవహరించాలని, సమగ్రతను కాపాడాలని ఆయన చెప్పారు. వ్యక్తులు శాశ్వతంగా ఉండరని, రాజ్యాంగ సంస్థలు, వాటి విలువలు మాత్రమే చిరస్థాయిగా ఉంటాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ పార్టీలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తాను. పరిస్థితులన్నీ అనుకూలించాక స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలనుకుంటున్నట్లు వెల్లడించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/