స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో విచారణ

అమరావతి: కరోనా నేపథ్యంలో ఏపిలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కష్టమని ఏపి ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ న్యాయవాది తాండవ యోగేష్ దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయాన్ని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అభిప్రాయం తెలపాలని ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణను నవబంరు 2 కి వాయిదా వేసింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/