డబ్ల్యూఎఫ్‌పీకి నోబెల్‌ శాంతి బహుమతి

World Food Programme wins 2020 Nobel Peace Prize

స్టాక్‌హోం: ఈ సంవత్సరం నోబెల్‌ శాంతి పురస్కారాన్ని ప్రపంచ ఆహార కార్యక్రమానికి( డబ్ల్యూఎఫ్‌పీ) ప్రకటించారు. స్టాక్‌హోమ్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో నోబెల్ క‌మిటీ ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించింది. ఐక్య‌రాజ్య‌స‌మితి ఆధ్వ‌ర్యంలో డ‌బ్ల్యూఎఫ్‌పీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఆక‌లి చావుల నివార‌ణ‌కు ప్ర‌య‌త్నించింది. అంత‌ర్ యుద్ధంతో ర‌గులుతున్న ప్రాంతాల్లో శాంతి నెల‌కొల్పేందుకు వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎంతో దోహ‌ద‌ప‌డిన‌ట్లు నోబెల్ క‌మిటీ వెల్ల‌డించింది. యుద్ధ ప్రాంతాల్లో ఆక‌లిని ఆయుధంగా మార్చుకుని శాంతిని స్థాపించిన‌ట్లు క‌మిటీ చెప్పింది. మాన‌వాళిని పీడిస్తున్న ఆక‌లి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అతిపెద్ద కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టిన‌ట్లు నోబెల్ క‌మిటీ పేర్కొన్న‌ది. 2019లో 88 దేశాల్లో ఆక‌లితో అల‌మ‌టిస్తున్న సుమారు వంద మిలియ‌న్ల మందికి ఆహారాన్ని అందించిన‌ట్లు నోబెల్ క‌మిటీ ప్ర‌శంసించింది.

దీంతో పాటు ఆకలిని యుద్ధ ఆయుధంగా మలుచుకునే చర్యలను నిరోధించేందుకు చేసిన ప్రయత్నాలకు గాను డబ్ల్యూఎఫ్‌పీకి ప్రతిష్టాత్మక నోబెల్‌ శాంతి బహుమతిని ప్రకటించామని నోబెల్‌ కమిటీ ట్వీట్‌ చేసింది. డబ్ల్యూఎఫ్‌పీ ఏటా 88 దేశాల్లోని 9.7 కోట్ల మంది ప్రజలకు సాయపడుతోందని తెలిపింది. ఇక ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ప్రతి తొమ్మిది మందిలో ఒకరు తినడానికి సరిపడినంత ఆహారం లేక బాధపడుతున్నారని పేర్కొంది. కరోనా వైరస్‌తో ఆకలితో అలమటించే బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌పీ సేవలు కొనియాడదగినవని నోబెల్‌ కమిటీ చీఫ్‌ బెరిట్‌ రీస్‌అండర్సన్‌ ప్రశంసించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/