మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడొచ్చు..హైకోర్టు

ఎస్ఈసీ, ఎన్నికల ప్రక్రియపై మాట్లాడకూడదు

అమరావతి: మంత్రి కొడాలి నానికి హైకోర్టులో ఊరట లభించింది. కొడాలి నానిపై ఎస్‌ఈసీ విధించిన ఆంక్షలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రభుత్వ పథకాల గురించి మీడియాతో కొడాలి నాని మాట్లాడవచ్చని పేర్కొంది. అయితే, ఎస్ఈసీ గురించి కానీ, ఎన్నికల కమిషనర్ గురించి కానీ ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియపై కూడా మాట్లాడకూడదని సూచించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. తమ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని పేర్కొంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/