మార్చిలో ప్రధాని మోడి ‘పరీక్షా పే చర్చ’

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఏటా నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమం మార్చి నెలలో జరుగనుంది. పరీక్షలు రాయనున్న తొమ్మిది నుంచి 12వ తరగతి విద్యార్థులలో భయాందోళనలను తొలగించడానికి ప్రధాని 2018 నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏటా జనవరిలో జరిగే ఈ సమావేశం కరోనా వల్ల కొంత ఆలస్యమయ్యింది. అయితే ఈసారి ప్రత్యక్షంగా కాకుండా వర్చువల్‌ విధానంలో విద్యార్థులతో ప్రధాని ముచ్చటిస్తారని విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ వెల్లడించారు. ఈ సమావేశం మార్చి నెలలో జరుగుతుందని, తేదీలను త్వరలో వెల్లడిస్తామని ట్వీట్‌ చేశారు. కాగా, ఈ ఏడాది విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా అనుమతించనున్నారు.


కాగా, దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుందని, మార్చి 14 వరకు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రధానితో ఇంటరాక్ట్‌ అవ్వాలనుకున్న విద్యార్థులు innovateindia.mygov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించారు. ఎంపిక చేసిన థీమ్‌లలో 500 పదాలకు మించకుండా తమ ప్రశ్నలను పంపించాలని చెప్పారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/