డాక్టర్‌ సుధాకర్‌ కేసులో హైకోర్టు కీలక ఉత్తర్వులు

ap high court
ap high court

అమరావతి: ఏపి హైకోర్టు విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌ అరెస్టుకు సంబంధించి కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సెషన్స్‌ జడ్జి నేరుగా ఆస్పత్రికి వెళ్లి.. డా.సుధాకర్‌ వాంగ్మూలం రికార్డ్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది. రేపు సాయంత్రం వరకు నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో హైకోర్టు పేర్కొంది. అలాగే ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌, వీడియో క్లిప్పింగ్‌లను.. పిటిషనర్‌ తరపు న్యాయవాదులకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కాగా హైకోర్టు ఆదేశాలతో డా.సుధాకర్‌ కేసులో విశాఖ సెషన్స్‌ జడ్జి విచారణ చేపట్టారు. మానసిక వైద్యశాలలో ఉన్న డాక్టర్‌ సుధాకర్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సెషన్స్‌ జడ్జి విచారిస్తున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/