టీడీపీ కార్యాలయాల ఫై , పట్టాభి ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేసిన పోలీసులు

తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఫై అలాగే పట్టాభి ఇంటి ఫై దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో 10 మందిని, పట్టాభి నివాసంపై దాడి ఘటనలో 11 మందిని అరెస్ట్ చేశారు. టీడీపీ కార్యాలయంపై పల్లపు మహేశ్, గోక దుర్గాప్రసాద్, షేక్ అబ్దుల్లా, శేషగిరి, పానుగంటి చైతన్య, జోగ రమణ, పేరూరి అజయ్, అడపాల గణపతి, కోమటిపల్లి దుర్గారావు, పవన్ దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు.

మిగిలిన నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. మరోపక్క ఎన్టీఆర్ భవన్‌కు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. కార్యాలయ ఉద్యోగి భద్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులు కోరారు. విచారణలో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషనుకు వచ్చి వివరాలు అందివ్వాలని రిస్పెషన్ కమిటీ సభ్యుడు కుమార స్వామికి నోటీసులు జారీ చేశారు.