రాష్ట్రంలో ప్రాజెక్టుల తీరుపై పొన్నం విమర్శలు

Ponnam Prabhakar
Ponnam Prabhakar

సిద్దిపేట: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ అక్కనపేట మండలం గౌరవెల్లి ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం భూ నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా పొన్నం టిఆర్‌ఎస్‌ ప్రభుత్వ తీరుపై మండిపడుతూ.. రాష్ట్రంలో ప్రాజెక్టుల తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తానన్న సిఎం కెసిఆర్‌ మాటలు ఏమయ్యాయి ?, కుట్రలో భాగంగానే గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను నిర్లక్ష్యం చేసి సిద్దిపేట నియోజకవర్గానికి నీళ్లు తీసుకుపోయేందుకే రంగనాయక్ సాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేశారు. హరీష్‌రావు, కెటిఆర్‌ సంబరాలు చేసుకుంటే.. ఈ ప్రాంత ప్రజలు మీకు శవ యాత్రలు చేయాలా?, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టులను కాలపరిమితితో తొందరగా పూర్తి చేయకపోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు?, ప్రాజెక్టులు పూర్తి చేసేంతవరకు నిర్వాసితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. ప్రాజెక్టులు పూర్తి చేస్తే మేమే కెసిఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తాం అని పొన్నం అన్నారు.


తాజా కరోనా లాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/