టిడిపికి మరో నేత గుడ్‌బై

వైఎస్‌ఆర్‌సిపిలో చేరతానని అధికారికంగా ప్రకటించిన కరణం బలరాం

karanam-balaram
karanam-balaram

అమరావతి: టిడిపి మరో నేత గుడ్‌బై చెప్పనున్నాడు. ప్రకాశం జిల్లా చీరాల టిడిపి ఎమ్మెల్యె, మాజీ మంత్రి కరణం బలరాం పార్టీని వీడనున్నారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు వెంటేశ్‌ కూడా సిఎం జగన్‌ సమక్షంలో వైఎస్‌ఆర్‌సిపి తీర్థం పుచ్చుకుంటున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటన చేశారు. తన నియోజకవర్గ కార్యకర్తల కోరిక మేరకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కరణం బలరాం మీడియాకు తెలిపారు. తన నియోజక వర్గ అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. కాసేపట్లో ఆయన జగన్‌ను కలవనున్నారు. చీరాల మండలం రామకృష్ణాపురం నుంచి తన మద్దతుదారులతో ఆయన భారీ ర్యాలీగా తాడేపల్లిలోని జగన్ క్యాంప్‌ కార్యాలయానికి బయలుదేరారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/