అధ్యక్ష ఎన్నికలు..సర్వే ముందంజలో బిడెన్‌

biden – trump

వాషింగ్టన్‌: అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరుగునున్న విషయం తెలిసిందే. అయితే ట్రంప్‌, జో బిడెన్‌ ల మధ్య విజయావకాశాలు చాలా తక్కువ శాతంతో ఉండటంతో అమెరికన్లతోపాటు ఇతర దేశాల ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. వసీఎన్ఎన్ పోల్ సర్వేలో ట్రంప్‌ కన్నా జో బిడెన్‌ 11 శాతం ఎక్కువ ప్రజల మద్దతు ఉన్నట్లుగా తేలింది. కరోనా విషయంలో ట్రంప్‌ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించారని, ఇలాంటి అధ్యక్షుడు మళ్లీ రావడం వలన ప్రజలు మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని అభిప్రాయపడుతున్నట్లు చాలా మంది చెప్పినట్లు తెలుస్తున్నది.

కరోనా విషయంలో ట్రంప్‌ది బాధ్యతారాహిత్యమని 63 శాతం మంది చెప్పగా.. తన చుట్టూ ఉండేవారి భద్రత, వైరస్‌ వ్యాప్తి ప్రమాదాన్ని విస్మరించారని పలువురు అభిప్రాయపడ్డారు. సియానా కాలేజీతో కలిసి న్యూయార్క్ టైమ్స్‌ నిర్వహించిన సర్వేలో కూడా జో బిడెన్‌కు మద్దతుగా ఓటర్లు నిలిచారు. రెండు ఎన్నికల్లోనూ నెవాడాలో బిడెన్ కంటే ట్రంప్‌ 6 పాయింట్లు వెనుకబడి ఉన్నారు. నాలుగేండ్ల క్రితం ట్రంప్ ఒహియో నుంచి గెలిచినప్పటికీ, ప్రస్తుత పోల్‌లో అతను ఇంకా బిడెన్ కంటే 1 పాయింట్ వెనుకబడి ఉన్నాడు. అయితే, టెక్సాస్‌ ఒక్కటే ట్రంప్‌కు మద్దతుగా నిలుస్తుండటం విశేషం.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/