పోలవరం ఖర్చు వంద శాతం కేంద్రానిదే
లిఖితపూర్వకంగా తెలిపిన కేంద్రమంత్రి షెకావత్

న్యూఢిల్లీ: పార్లమెంట్‌లో రెండవ విడత బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. టిడిపికి చెందిన ఎంపి కేశినేని నాని పోలవరం ప్రాజెక్టు అంశంపై ఓ ప్రశ్న అడగగా, కేంద్ర జలశక్తి శాఖ సమాధానమిచ్చింది. ఫిబ్రవరి నాటికి పోలవరం 69.54 శాతం పూర్తయినట్టు రాష్ట్రం చెప్పిందని కేంద్రమంత్రి షెకావత్ లిఖితపూర్వకంగా వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ఖర్చును 100 శాతం కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. 2014 నుంచి రాష్ట్రం ఖర్చు చేసిన ప్రతి రూపాయిని కేంద్రం చెల్లిస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇప్పటివరకు రూ.8614.16 కోట్లు ఏపీకి చెల్లించిందని పేర్కొన్నారు. ఈ మొత్తంలో గత నెల విడుదల చేసిన రూ.1850 కోట్లు కూడా ఉన్నాయని వెల్లడించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/