రుయా హాస్పటల్ అంబులెన్స్ ఘటనపై ఏపీ సర్కార్ సీరియస్

తిరుపతి రుయా ఆస్పత్రిలో బాలుడి మృతదేహాన్ని స్వస్ధలానికి తరలించేందుకు అంబులెన్స్ డ్రైవర్లు ఎక్కువ డబ్పులు డిమాండ్ చేయడంతో తండ్రి బైక్ మీదే 90 కిలోమీటర్లు తీసుకెళ్లిన ఘటన ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతుంది. ఈ ఘటన పట్ల ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు ప్రభుత్వ హాస్పటల్స్ లలో జరుగుతున్నాయని ఆరోపిస్తూ సోషల్ మీడియా లో ట్వీట్స్ పెడుతున్నారు.

ఇక ఈ ఘటన పట్ల ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై వైసీపీ ఎంపీ గురుమూర్తి కలెక్టర్‌తో మాట్లాడారు. ఈ నేపథ్యంలో రుయా ఆర్‌ఎంవోను కలెక్టర్ సస్పెండ్ చేశారు. మరోవైపు రుయా సూపరింటెండెంట్ భారతికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నలుగురు ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అంబులెన్స్ ప్రీపెయిడ్ ట్యాక్సీ ధరలను నిర్ణయించడానికి ఆర్డీవో, డీఎంహెచ్‌వో, డీఎస్పీతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు.