సిఎం జగన్‌పై బుద్ధా వెంకన్న సంచలన ట్వీట్‌

Buddha Venkanna
Buddha Venkanna

అమరావతి: ఏపి సిఎం జగన్‌పై టిడిపి నేత బుద్ధా వెంకన్న సంచలన ట్వీట్‌ చేశారు. టిడిపి అధినేత చంద్రబాబుకు జైలుకు వెళ్లే సమయం దగ్గర పడిందని వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయి రెడ్డి.. ‘ఆ జైలు కెళ్తావా చంద్రన్న, ఈ జైలు కెళ్తావా?’ అంటూ చేసిన వ్యాఖ్యలపై టిడిపి నేత బుద్ధా వెంకన్న స్పందించారు. ‘జైలు జీవితం గురించి మీ స్వానుభవంతో చాలా చక్కగా వివరించారు విజయసాయిరెడ్డి గారు. కాకపోతే ఆ గట్టున ఉన్నది రస్ అల్ ఖైమా సెంట్రల్ ప్రిసన్. ఈ గట్టున ఉన్నది చంచల్ గూడ సెంట్రల్ జైలు. నడి మధ్యన ఉన్నది పావురాల గుట్ట’ అని ఎద్దేవా చేశారు. ‘పాపం వచ్చేది ఎండాకాలం. ప్యాలెస్ లో సెంట్రల్ ఏసి కి అలవాటు పడిన జీవితాలు ఎడారి జైల్లో పరిస్థితి తలుచుకుంటే బాధేస్తుంది. జైలు పిలుస్తుంది ఊచలు లెక్క పెట్టాలి వైఎస్ జగన్ చిప్పకూడు తినాలి’ అని ట్వీట్ చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/