నెల్లూరు లో ఇక నుంచి ఫ్లెక్సీలపై ఎలాంటి నిబంధనలు లేవు – అనిల్ కుమార్ యాదవ్

former-minister-anil-yadav-meets-mla-kotamreddy-nellore

రెండున్నరేళ్లుగా ఫ్లెక్సీ రహిత నగరంగా నెల్లూరు సిటీని ఉంచగలిగా..ఫ్లెక్సీలు కట్టొద్దు అంటే కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారు. ప్రతిపక్షాలతో పాటు తమ పార్టీ నేతలు కూడా తనపై విమర్శలు చేస్తున్నారు. ఎవరికీ లేని బాధ నా ఒక్కడికే ఎందుకు..ఇక నుంచి ఫ్లెక్సీలపై ఎలాంటి నిబంధనలు లేవు అని అనిల్ కుమార్ అన్నారు. తనకు ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాలేదని , ప్రమాణ పూర్తిగా ఇది తన నిర్ణయమే అని స్పష్టం చేసారు.

అనిల్ కుమార్ యాదవ్ గూండాయిజం చేస్తారని కొందరు ఆరోపిస్తున్నారని..తాను గనక గూండాయిజం చేస్తే ఫ్లెక్సీలు కట్టినవారి చేతులు ఉండేవా? అని ప్రశ్నించారు. అలాంటివి తాను చేయనని అన్నారు. నెల్లూరు సిటీలో గతంలో తన ఫ్లెక్సీలు కట్టలేదని.. ఇకపై కట్టేది లేదని అన్నారు. ఏ పార్టీ నేతలైనా ఫ్లెక్సీలు కట్టుకోవచ్చన్నారు. అయితే, తన ఫ్లెక్సీలు మాత్రం కట్టేది లేదన్నారు. ఎవరైనా తన ఫ్లెక్సీలు కడితే తానే తీసేస్తానన్నారు అనిల్ కుమార్ యాదవ్. ప్రతిపక్ష నేతల ఫ్లెక్సీలతోపాటు అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు కూడా తొలగించడంపై నెల్లూరులో రాజకీయంగా సంచలనంగా మారింది. అధికార వైసీపీ రాజ్యసభసభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరులోని పలు ప్రాంతాల్లో అభిమానులు, అనుచరులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే, వాటిని అధికారులు తొలగించారు. దాంతో అప్పటి నుండి నెల్లూరు లో ప్లెక్సీల వివాదం తారాస్థాయికి చేరుకుంది. దీంతో అనిల్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి ఇక ఫై నెల్లూరులో ఫ్లెక్సీలు కట్టుకోవచ్చన్నారు.