సామాజిక దూరాన్ని పాటిస్తూ.. మూడో స్టేజికి వెళ్ళకుండా నియంత్రించాలి
ఐసీఎంఆర్ సైంటిస్ట్ గంగాఖేడ్కర్

New Delhi: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఈ నేపధ్యంలో కరోనా మూడో దశకు చేరుకుందన్న ప్రచారం విస్తృతంగా సాగుతోంది. దీనిపై ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ స్పందించింది.
కరోనా వైరస్ దేశంలో మూడో దశకు చేరుకుందని వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. అలాంటి వదంతులను నమ్మవద్దని ఐసీఎంఆర్ ప్రకటించింది.
ఐసీఎంఆర్ సైంటిస్ట్ ఆర్. గంగాఖేడ్కర్ మాట్లాడుతూ ప్రజలు అందరూ కూడా సామాజిక దూరాన్ని పాటిస్తూ.. కరోనా మూడో స్టేజికి వెళ్ళకుండా నియంత్రించాలని సూచించారు.
తీవ్రమైన శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న వారిలో 10 శాతం(అంటే 110 మందిలో 11) మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని ఆయన అన్నారు.
మరోవైపు ఎటువంటి ట్రావెల్ హిస్టరీ, కరోనా బాధితులతో కాంటాక్ట్ లేని చెన్నై, ఉత్తరప్రదేశ్, మహరాష్ట్రలకు చెందిన ముగ్గురు పేషంట్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందన్న ఆయన అంత మాత్రాన కరోనా వైరస్ కమ్యునిటీ ట్రాన్స్మిషన్(సమూహాల ద్వారా వ్యాప్తి) దశలో ఉందని చెప్పలేమన్నారు.
ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ కమ్యునిటీ ట్రాన్స్మిషన్(సమూహాల ద్వారా వ్యాప్తి) దశలో లేదని, రెండో దశలోనే ఉందని గంగాఖేడ్కర్ తెలిపారు.
అయితే పరిస్థితిని ఇప్పుడు అదుపు చేయలేకపోతే మాత్రం తీవ్ర నష్టం తప్పదని ఆయన అన్నారు.
తాజా వార్త ఇ-పేపర్ కోసం క్లిక్ చేయండి: https://epaper.vaartha.com/