ఉప ఎన్నికల వేళ ఈటలకు ఊహించని షాక్

హుజురాబాద్ ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతుండడం తో బిజెపి , తెరాస , కాంగ్రెస్ పార్టీ లు తమ ప్రచారంలో మునిగిపోయారు. ఎవరికీ వారు విమర్శలు , ప్రతి విమర్శలు చేసుకుంటూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈటల రాజేందర్ కు ఊహించని షాక్ ఎదురైంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కు బిజెపి ఫై తెరాస పిర్యాదు చేసింది.
బీజేపీ పార్టీ అభ్యర్థి హుజురాబాద్ లో ఓటర్లకు డబ్బులు పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఫిర్యాదు లో పేర్కొంది. కొత్త బ్యాంక్ ఖాతాల లో డబ్బులు జమ చేస్తున్నారని… ఈటల రాజేందర్ అక్రమాలపై ఇప్పటికే అనేక మార్లు ఫిర్యాదు చేశామని టీఆర్ఎస్ పేర్కొంది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పై పిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడం లేదు, తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ టీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్‌కు ఫిర్యాదు చేశారు.
మరోపక్క హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ తగు జాగ్రత్తలను తీసుకుంటున్నది. అందులో భాగంగా ఉప ఎన్నిక కోసం 20 కంపెనీల కేంద్ర బలగాలు ఒకటి, రెండు రోజుల్లో రానున్నాయి. ఇప్పటికే హుజూరాబాద్‌కు 3 కంపెనీల బలగాలు చేరుకున్నాయి.