ఏపీ గవర్నర్, జస్టిస్ అబ్దుల్ నజీర్ కు సర్జరీ

ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడి

AP Governor, Justice Abdul Nazeer

అమరావతి : ఆంధ్రప్రదేశ్ గవర్నర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్య పరిస్థితిపై మణిపాల్ ఆస్పత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై మీడియాకు వివరాలు అందించారు. గవర్నర్ ఈరోజు తీవ్ర కడుపు నొప్పి కారణంగా మణిపాల్ హాస్పిటల్లో చేరారని , వైద్యపరీక్షల్లో ఆయన అక్యూట్ అపెండిసైటిస్‌తో బాధ పడుతున్నట్లు వైద్యపరీక్షల్లో తేలిందన్నారు. గవర్నర్‌కు రోబో సాయంతో ‘అపెండెక్టమీ’ అనే సర్జరీని చేసినట్టు తెలిపారు. సర్జరీ విజయవంతం అయినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు.

తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/telangana/