తమన్నా’లెవన్త్‌ అవర్‌’..

వెబ్‌ సిరీస్‌ త్వరలోనే ‘ఆహా’లో ప్రసారం

Tamanna ‘Eleventh Hour’-Web Series


తెలుగు ఓటీటీ ‘ఆహా’. సినిమాలు, ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ‘ఆహా’ మాధ్యమం..

ఇప్పుడు 18 మిలియన్‌ వీక్షకులను సొంతం చేసుకుని సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తూ కొత్త ఒరవడిని సృష్టిస్తూ దూసుకెళ్తోంది.

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో ప్రముఖ దర్శకుడు ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ‘లెవన్త్‌ అవర్‌’ అనే వెబ్‌ సిరీస్‌ను రూపొందిస్తోంది.

త్వరలోనే ఆహాలో ప్రసారం కానున్న ‘లెవన్త్‌ అవర్‌’ వెబ్‌ సిరీస్‌కు సంబంధించిన టైటిల్‌ను, పోస్టర్‌ను సోమవారం విడుదల చేశారు.

అల్లు అరవింద్‌, మిల్కీ బ్యూటీ తమన్నా, డైరెక్టర్‌ ప్రవీణ్‌ సత్తారు, రైటర్‌-ప్రొడ్యూసర్‌ ప్రదీప్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/