వైసీపీకి పవన్ ఛాలెంజ్..మీరా..మేమా తేల్చుకుందాం

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..వైసీపీ కి ఛాలెంజ్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఢంకా భజాయించబోతుంది. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం మారబోతుంది. అప్పుడు పాండవుల సభ ఎలా ఉంటుందో చూపిస్తాం. ఏపీ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఢిల్లీ నేతలకు చెపుతూనే ఉన్న అంటూ జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ చెప్పుకొచ్చారు. 151 సీట్లు సాధించిన వైసీపీ..వచ్చే ఎన్నికల్లో 15 సీట్లు రావొచ్చేమో చెప్పలేం ఏంజరుగుతుందో..

‘‘నేను ఎప్పుడు ఏం అడిగినా ఏపీ గురించే అడుగుతా. టీడీపీకైనా బీజేపీకైనా ఏపీ కోసమే మద్దతు ఇచ్చా. కాట్ల కుక్కల్లా అరుస్తారేంటి.. మాట్లాడటం రాదా మీకు?. ఓ పని చేయండి.. ఇళ్లలోకి వచ్చి బంగారం కూడా లాగేసుకోండి. నేను అడుగుతున్నది ఒకరి కష్టార్జితాన్ని మీరెవరు దోచుకోవడానికి అని అడిగా. నేను సినిమా టికెట్ల గురించి అడిగా నాకేమైనా థియేటర్లు ఉన్నాయా? వైసీపీ వారికే ఉన్నాయి. మహానుభావులకు తల వంచుతాం. మీలాంటి వారి తాట తీస్తాం. ఏదైనా అంటే అరుస్తారు.. మాట్లాడరు. ఏపీలో అభివృద్ధి లేదు. ఒక్క రోడ్డయినా వేశారా?’’ అని పవన్ ప్రశ్నించారు. తాను పారిపోయే వ్యక్తిని కాదని, తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ఏం అడిగినా ఏపీ గురించే అడుగుతానని చెప్పారు. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని పవన్‌ హెచ్చరించారు. తాను ఆడబిడ్డలను చాలా గౌరవిస్తానని చెప్పారు.