ఏపీ ప్రభుత్వం ఫై ఆగ్రహం వ్యక్తం చేసిన దేవినేని ఉమా

వరద వచ్చే విషయాన్ని ప్రజలకు చేరవేయలేని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదుష్టకరమని , పోలవరం నిర్వాసితులను నట్టేటి ముంచి ముఖ్యమంత్రి గాల్లో పర్యటన చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. పోలవరం ముంపు మండలాల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రికి కనిపించడం లేదా అంటూ ఉమా ఆగ్రహం వ్యక్తం చేసారు. గోదావరి ఉధృతికి ముంపు గ్రామాలూ మునిగిపోయాయని , కనీసం వారిని ఆదుకునే ప్రయత్నం జగన్ చేయాలనీ మండిపడ్డారు.

ప్రభుత్వ యంత్రాంగం మొద్దు నిద్రలో ఉందని.. చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వ యంత్రాగాన్ని పరిగెత్తించారని గుర్తు చేశారు. నూతన జిల్లాల్లో అనుభవం ఉన్న అధికారులు ఎవరూ లేరని.. సీనియర్ అధికారులు అందుబాటులో లేరని దేవినేని అన్నారు. చీఫ్ సెక్రటరీ అధికారులను అప్రమత్తం చేయకుండా విజయవాడలో.. సెక్రటేరియట్‌లో కూర్చున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం నిర్వాసిత గ్రామాల్లో ప్రజల బాధలను పట్టించుకునే నాథుడే లేరని.. కనీస సౌకర్యాలను ప్రభుత్వం అందించడం లేదని , వైద్య సౌకర్యాలు కూడా లేవని.. అధికారులు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారంటూ నిలదీశారు.