ఏపీ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ అరెస్ట్?

ఈ కేసులో ఏ5 నిందితుడిగా ఉన్న సూర్యనారాయణ

ap-employees-leader-suryanarayana-arrested

అమరావతిః ఏపి ఉద్యోగుల సంఘం నేత కేఆర్ సూర్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై గత నెల 31న విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ఏ5 నిందితుడిగా ఉన్నారు. ముందస్తు బెయిలు కోసం విజయవాడ ఏడీజే కోర్టులో వేసిన పిటిషన్‌ ఈ నెల 15న తిరస్కరణకు గురైన తర్వాత ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విశాఖపట్టణం, విజయవాడ, ఢిల్లీ సహా పలు నగరాల్లో ఆయన కోసం పోలీసులు గాలించారు.

చివరికి నిన్న ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విజయవాడ నగరంలోని ఓ రహస్య ప్రదేశంలో ఆయనను విచారిస్తున్నట్టు సమాచారం. అయితే, పోలీసులు మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.