ఆర్టీసీ కార్మికులకు శుభవార్త తెలిపిన ఏపీ సీఎం

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి..ఆర్టీసీ కార్మికులకు శుభవార్త తెలిపారు. అక్టోబర్‌ 1వ తేదీ నుంచి కొత్త పీఆర్సీని అమలు చేస్తామని ప్రకటించారు. అంతే కాకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఏపీపీటీడీగా మార్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కార్మికులుగానే ఉన్న వీరికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు లభించనుంది. ఇక జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల కార్మికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే సంస్థలు పనిచేస్తున్న కార్మికులు గతంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెల్లూరు రీజియన్ లో నెల్లూరు1, 2 రాపూరు, ఆత్మకూరు, ఉదయగిరి, కావాలి, కందుకూరు డిపోలో 2,951 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరితోపాటు ఆర్ఎం కార్యాలయంలోని 60 మంది ఉద్యోగులు మొత్తంగా 3,011 మందికి నూతన పిఆర్సి ప్రకారం అక్టోబర్ 1 నుంచి కొత్త జీతాలు అందనున్నాయి. ఉద్యోగుల స్థాయిని బట్టి రూ. 3వేల నుంచి రూ.6 వేల వరకు అదనంగా జీతాలు పెరగనున్నాయి. వీటితో పాటు టిఏ, డిఏలు, ఇతర అలవెన్సులు అందనున్నాయి.