మానవహక్కుల సమావేశానికి చంద్రబాబు ఎందుకొస్తారు?

చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన విజయసాయి

అమరావతి: వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను మేకవన్నె పులి, గుంటనక్క అని సంబోధించారు. మానవహక్కుల సమావేశానికి రాని చంద్రబాబు, యనమలపై విమర్శలు గుప్పించారు.

‘ఈ మేకవన్నె పులి, … ఈ గుంట నక్క” అని ఎన్టీఆర్‌ పేర్కొన్న చంద్రబాబు నాయుడ్ని, వెన్నుపోటుకు స్పీకర్‌గా ఉపయోగపడిన యనమలను మానవహక్కుల సమావేశానికి రమ్మంటే వారు ఎందుకు వస్తారు చెప్పండి? తమను మానవులుగా గుర్తించటం వీరిద్దరికీ ఏనాడూ ఇష్టముండదు మరి!’ అని ట్వీట్ చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/