మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలి : సీఎం జగన్
మీ ప్రేమ, ఆశీస్సులతో సీఎంగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లవుతోంది..జగన్

అమరావతి: సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. ‘మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95 శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/