ఈ నెల 14న ఏపీ కేబినెట్ సమావేశం

ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ జవహర్ రెడ్డి

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతిః ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఈ కీలక సమావేశం జరగబోతోంది. ఈ నెల 14న మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. ఏపీ సెక్రటేరియట్ లోని ఒకటో బ్లాక్ లో 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భేటీ ప్రారంభమవుతుంది. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులకు ఈ సమావేశంలో మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.