ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఫస్ట్ డైనే వార్ మొదలైంది

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ప్రారంభం అయ్యాయో లేవో అప్పుడే అసెంబ్లీ లో టీడీపీ- వైస్సార్సీపీ మధ్య వార్ మొదలైంది. సమావేశాలు ప్రారంభం కాగానే ఉభయసభలను ఉద్దేశించి నూతన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అయితే ప్రసంగంలో వైస్సార్సీపీ స్క్రిప్ట్‌ని గవర్నర్ చేత చదివిస్తున్నారని..గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు అడ్డుపడ్డారు. గవర్నర్ చేత పూర్తిగా అబద్దాలు చెప్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అసెంబ్లీలో గవర్నర్ చేత అబద్దాలు చెప్పించడం సరికాదని చెబుతూ టి‌డి‌పి ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు 9 రోజులపాటు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి 24 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా.. 16వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. మార్చి 15వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం, మార్చి 16వ తేదీన 2023 – 24 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెడతారు. మార్చి 19న సెలవు కాగా.. మార్చ్ 22న ఉగాది సందర్భంగా సెలవు. ఇక మార్చి 23న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు. అలా ఈనెల 24 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.